యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు తొలిసారి కలిసి చేసిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటించిన నాటి నుంచీ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక అయితే చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, సినీ వర్గాలు కూడ సినిమా పక్కా హిట్ అనే నిర్ణయానికొచ్చేశాయి. దీంతో ట్రేడ్ వర్గాల్లో సినిమా బిజినెస్ ఓ రేంజిలో జరిగింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ బిజినెస్ సుమారు 94.25 కోట్లని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది పెద్ద మొత్తం. ఈ మొత్తాన్ని వెనక్కు రాబట్టాలంటే సినిమా భారీ విజయాన్ని దక్కించుకోవాలి. అప్పుడే కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేవ్ అవుతారు. మరి ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే అక్టోబర్ 12 వరకు ఆగాల్సిందే.
| ఏరియా వైజ్ | బిజినెస్ (కోట్లలో ) |
| నైజాం | 20.00 |
| సీడెడ్ | 15.00 |
| నెల్లూరు | 3.35 |
| కృష్ణా | 5.60 |
| గుంటూరు | 7.80 |
| వైజాగ్ | 9.20 |
| ఈస్ట్ గోదావరి | 6.30 |
| వెస్ట్ గోదావరి | 5.00 |
| మొత్తం (ఆంధ్రా & తెలంగాణా) | 72.25 |
| భారత్ లో మిగిలిన ప్రాంతాలు | 10.00 |
| ఓవర్ సీస్ | 12.00 |
| ప్రపంచ వ్యాప్తంగా మొత్తం బిజినెస్ | 94.25 |
