ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అరవింద సమేత చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రంపై ట్రేడ్ సర్కిల్స్ లో హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో అడ్వాన్స్ బుక్కింగ్ లు కూడా టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఓవర్ సీస్ లో అయితే అరవింద సమేత ..భారీ గా ప్రీమియర్స్ పడుతున్నాయి. యుఎస్ భాక్సాఫీస్ వద్ద సాలిడ్ గా స్టార్ట్ అవుతోంది. ఈ జోరు చూస్తూంటే ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా రికార్డ్ లు బ్రద్దలు అయ్యేటట్లు ఉంది. ఫస్ట్ వీకెండ్ దుమ్ము దులపనుంది.

ఇక ఈ చిత్రం పాజిటివ్ విషయాలకు వస్తే…ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావటం ప్లస్ కానుంది. దాంతో ఈ సినిమాలో వీర రాఘవగా ఎన్టీఆర్‌ని త్రివిక్రమ్ ఎంత గొప్పగా చూపించాడో అని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. దానికి తోడు …మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసే పంచ్ డైలాగులు ఎన్టీఆర్ ఎలా పలికాడో అనేది మరో టాపిక్.

ఇలా ఒకదానికి మరొకటి పెనవేసుకుని…టీజర్స్, ట్రైలర్స్ హిట్ అవటంతో..భీబత్సమైన …. పాజిటీవ్ బజ్ నడుస్తుంది. దానికి తగ్గట్లే ..బిజినెస్ కూడా ఓ రేంజులో జరిగింది. ఇవన్నీ చూస్తున్న ట్రేడ్ ఓపినింగ్స్ అదిరిపోవడం ఖాయం అని లెక్కలు వేసేస్తోంది. దసరా సీజన్ ని ‘అరవింద..’ క్యాష్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

