జూనియర్ ఎన్టీఆర్ ,పూజ హెగ్డే నటించిన “అరవిందసమేత ” చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా హారికా హాసిని క్రియేషన్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ మొదటిసారి కలసి పనిచేసిన చిత్రం “అరవిందసమేత “. ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.
ఈ చిత్రం షూటింగ్లో ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ మరణించాడు . ఎన్టీఆర్ చాలాకాలం దుఃఖం లో ఉంటాడు కాబట్టి ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుంది దర్శకుడు త్రివిక్రమ్ భావించాడు . అయితే దుఃఖాన్ని దిగమింగుకొని ఈ చిత్రం షూటింగ్లో పాల్గొన్నాడు.
ఎన్టీఆర్ అన్న జానకిరామ్ కారు ప్రమాదంలోనే మరణించాడు . తండ్రి హరికృష్ణ కూడా కారు ప్రమాదంలోనే చనిపోవడంతో నందమూరి కుటుంబం విషాదంలో మునిగిపోయింది .
అందుకే అరవిందసమేత .. ప్రారంభంలో ఎన్టీఆర్ ఒక సందేశాన్ని ఇచ్చాడు . “కారులో ప్రయాణించేతప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని, మీ గమ్యం మీ ఇల్లే కావాలని “చెప్పాడు. ఆ సందేశం పైన తండ్రి హరికృష్ణ , సోదరుడు జానికీరాం ఫోటోలు వున్నాయి. వారిద్దరికీ అరవిందసమేత చిత్రాన్ని అంకితం ఇచ్చారు .