(సూర్యం)
ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ చేసిన పని ఇప్పుడు కోలివుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన తనతో పాటు పనిచేసిన సర్కార్ టీమ్ కు లీగల్ నోటీస్ లు పంపుతానని బెదిరించారు. తన ఫర్మిషన్ లేకుండా ఏ మీడియా సంస్దకి ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని హెచ్చరించారు మురుగదాస్. అలా ఎవరైనా చేస్తే కనుక వారికి లీగల్ నోటీస్ లు పంపుతాను అన్నారు. అసలేం జరిగింది.
ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సర్కార్’. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన ఈ సినిమాలో కీర్తి సురేశ్, వరలక్ష్మి
శరత్‌కుమార్ హీరోయన్స్ గా నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నవంబర్6న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా.. కొందరు ఈ సినిమా ప్రచారంలో భాగంగా..సినిమా కాన్సెప్టుని లీక్ చేసేస్తున్నారని, అలాంటి పనులు చేయవద్దని.. ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వద్దంటూ మురుగదాస్ చిత్రయూనిట్ హెచ్చరించారు.ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
Dear Sarkar Cast n Crew,
So many people have put their hardwork for the making of this movie. Despite, there are many interviews by Junior artists, which is unethical. In the future, strict legal actions will be taken against people who give interviews without our consent.— A.R.Murugadoss (@ARMurugadoss) October 5, 2018
‘సర్కార్’ చిత్రబృందానికి విజ్ఞప్తి. ఈ సినిమా కోసం చాలా మంది తమ కష్టాన్ని ధారపోశారు. కొందరు జూనియర్ ఆర్టిస్ట్‌లు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నా అనుమతి లేకుండా సినిమా గురించి ఎవరైనా ఇంటర్వ్యూలు ఇస్తే వారిపై భవిష్యత్తులో చట్టపర్యమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. అయితే ఎవరిని ఉద్దేశిస్తూ మురుగదాస్ ఈ ట్వీట్ చేశారన్నది తెలియరాలేదు. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.