హీరోలతో సమానంగా స్టార్ గా వెలిగిన అనుష్క గురించిన ఓ వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటీ అంటే అనుష్క రిటైర్మెంట్ తీసుకోబోతోందని. నాగ్..సూపర్ సినిమాతో సినీ కెరీర్ మొదలెట్టిన ఆమె అతి తక్కువ కాలంలోనే సౌత్ లో నెంబర్ వన్ స్దాయికి వెళ్లింది. బాహుబలి చిత్రంతో ఆమె ప్రతిభ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది.
బాహుబలి 2 తర్వాత ఆమె భాగమతి చిత్రం మాత్రమే చేసింది. ఆ సినిమా హిట్ అయినా ఆమె ఏ సినిమా కూడా కమిట్ కాలేదు. దాంతో మీడియా అంతా ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ ,రిటైర్మెంట్ తీసుకోబోతోందని ప్రచారం చేయటం మొదలెట్టారు. ఈ ప్రచారం అబిమానులకు కాస్తంత బాధగానే ఉంది.
అయితే అనుష్క 36 సంవత్సరాల వయస్సుకి చేరింది. దాంతో వివాహం చేసుకుంటుంది …ఆ తర్వాత మళ్లీ వచ్చి సినిమాలు చేస్తుంది అన్నట్లు భావిస్తున్న్రారు. దానికి తోడు అనుష్క ఇంట్లో వాళ్లు కూడా ఆమెకు సంభంధాలు చూస్తున్నారని వినికిడి. ఇవన్ని ఒకెత్తు అయితే అనుష్క ..సినిమాల్లో కనిపించకపోవటానికి మరో కారణం..ఆమె యంగ్ హీరోల సరసన పెద్దదానిలా కనపడుతుందని, అందుకే ఏ హీరో ఆమెతో ఇంట్రస్ట్
చూపడం లేదని అంటున్నారు.
సీనియర్ హీరోలు వెంకటేష్,నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ సరసన చేయటానికి ఆమె ఆసక్తి చూపటం లేదని అంటున్నారు. అయితే ప్రభాస్ కొత్త చిత్రంలో ఆమె చేస్తుందని భావించినవారు సైతం అలాంటి ప్రకటన రాకపోవటంతో నిరుత్సాహపడ్డారు. మరి అభిమానుల అనుమానాలు తీర్చి,వారిలో దిగులు పోగొట్టడానికి అయినా అనుష్క అఫీషియల్ గా తన కెరీర్ గురించి ప్రకటన చేస్తే బాగుంటుంది.ఏమంటారు.