అరుంధతి నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారింది అనుష్క శెట్టి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్లు అయ్యాయా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మధ్యన ఆమె సినిమాలు తగ్గించింది. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత..కేవలం అంతకు ముందు ఎప్పుడో ఒప్పుకున్న భాగమతి మాత్రమే చేసింది. అందుకు కారణం ఆమె ఎదుర్కొంటున్న బరువు సమస్యలే.
సైజ్ జీరో కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క కు తన పాత లుక్‌లోకి రావటం ఇబ్బందిగా మారింది. అందుకోసం ఆమె విదేశాలు సైతం వెళ్లి న్యాచురల్ గా బరువు తగ్గించే పోగ్రామ్ లలో సైతం పాల్గొందని సమాచారం. ఆ మధ్యన బాహుబలి లో సైతం ఆమె లుక్ ని గ్రాఫిక్స్ లో చెక్కినట్లు వార్తలు వచ్చాయి.
ఇక భాగమతి తర్వాత ఏ సినిమాకి సైన్ చేయని ఈ అమ్మడు గీతాంజలి చిత్రాన్ని నిర్మించి మంచి విజయం సాధించిన కోన వెంకట్‌తో కలిసి లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమైంది. మాధవన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నాడు అని అంటున్నారు. తెలుగు తమిళ భాషలలో చిత్రాన్ని రూపొందించేందుకు కోన వెంకట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.
బాహుబలి, భాగమతి తర్వాత కథాబలమున్న పాత్రలను ఎంచుకుంటున్నఅనుష్క .. కోన వెంకట్ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా తన ట్విట్టర్ ద్వారా అనుష్క అత్యుత్తమ లుక్ ఇదేనంటూ ఓ ఫోటో పోస్ట్ చేశాడు కోనవెంకట్. ఇందులో నెమలి ఈక పట్టుకుని అనుష్క లుక్ అదిరిపోతోంది.
కాకపోతే ఈ ఫొటో ..ఫొటో షాప్ లో చేసింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ తో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంత హఠాత్తుగా లావుగా ఉన్న అనుష్క..పాతికేళ్ల అమ్మాయిలా ఎలా మారిపోతుంది అంటున్నారు. ఇదంతా కోన వెంకట్ చేస్తున్న మాయ అంటున్నారు. కాకపోతే ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి..కోన వెంకట్ లాంటి హై ఫ్రొఫైల్ ఉన్న సినీ సెలబ్రెటీ…అంతకు దిగజారతాడా..అది అసాధ్యం కదా. ఏమంటారు.