‘జెర్సీ’ పై అనుష్క అదిరిపోయే కామెంట్‌

నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్.ఈ నెల 19న విడుదలైన చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరింది. నాని నటన, గౌతమ్‌ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. . ఇందులో నాని ‘అర్జున్‌’ అనే క్రికెటర్‌గా కనిపించి అందరి ప్రశంసలు పొందారు. ఈ నేపధ్యంలో సెలబ్రెటీలంతా ఈ సినిమాని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఈ చిత్ర యూనిట్ మెచ్చుకుంటూ ఇప్పటికే ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ఎన్టీఆర్‌, సుధీర్‌బాబు, మంచు మనోజ్‌, హరీశ్‌ శంకర్‌ తదితరులు ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అందరూ ప్రత్యేకించి నాని నటనను మెచ్చుకున్నారు. ఇప్పుడు అనుష్క వంతు వచ్చింది.

‘జెర్సీ’ సినిమాను తాజాగా చూసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘జెర్సీ’… సినిమాలోని మ్యాచ్‌ చూసిన తర్వాత నేను పొందిన ఫీల్‌ను వివరించడానికి మాటలు ఉంటే బాగుండేదనిపిస్తోంది. నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌ (ఇది కేవలం స్వచ్ఛమైన ప్రేమ). నాని, మిగిలిన చిత్ర యూనిట్ శుభాకాంక్షలు. ఈ సినిమాను మాకిచ్చినందుకు ధన్యవాదాలు’ అని అనుష్క పోస్ట్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రాలకు అనిరుధ్‌ సంగీతం అందించారు.