వైరల్ : కృష్ణం రాజు మరణం పట్ల అనుష్క ఎమోషనల్ పోస్ట్..!

ఈరోజు టాలీవుడ్ సినిమా దగ్గర షాకింగ్ వార్తతోనే రోజు మొదలయ్యింది. తెలుగు సినిమా దగ్గర ప్రముఖ నటుడు అయినటువంటి స్టార్ హీరో నటుడు, నిర్మాతశ్రీ కృష్ణం రాజు స్వర్గస్థులయ్యారు. దీనితో టాలీవుడ్ లో ఒక్కసారిగా తీరని విషాదం నెలకొంది. దీనితో అనేక మంది సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే సినిమాతో పాటుగా రాజకీయాలు నుంచి కూడా ఎందరో ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరితో పాటుగా ప్రభాస్ మరియు వారి కుటుంబంతో మంచి అనుబంధం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కృష్ణం రాజు గారి ఆకస్మిక మరణం పట్ల ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టింది.

తాను కృష్ణం రాజుని ఆప్యాయంగా హత్తుకున్న ఫోటో షేర్ చేసుకొని మాకెంతో దగ్గరైన ఆప్యాయలు, ఎంతో పెద్ద మనసున్న కృష్ణం రాజు గారు ఆత్మకి శాంతి చేకూరాలని మా గుండెల్లో మాత్రం మీరెప్పుడూ నిలిచే ఉంటారని అనుష్క ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో తెలిపింది. దీనితో ఈమె ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.