‘అంతా Vచిత్రం’ ఆడియో విడుదల!

‘అంతా విచిత్రం త్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. అయాన్ ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు (కన్నారావు) ఆశీస్సులతో- ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న చిత్రం ‘అంతా విచిత్రం’. చిత్రానికి జి.శ్రీను గౌడ్ సహ నిర్మాత జై రామ్ కుమార్ దర్శకుడు.

ఈ సందర్భంగా దర్శకుడు జై రామ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫాన్స్ అయి ఉండి, వాళ్ళను నిజ జీవితంలో అనుకరిస్తుండే కొందరు కుర్రాళ్ళ కథతో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా అందరి ఆదరణ పొందుతుందని అన్నారు.

అందరూ చిన్న పిల్లలతో రూపొందిన ‘అంతా విచిత్రం’ మంచి విజయం సాధించాలని అతిధులు రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, అనంత రాముడు ఆశించారు. పిల్లలకు, పెద్దలకు స్ఫూర్తినిచ్చే పాటల్ని ఈ చిత్రం కోసం స్వర పరిచే అవకాశం లభించిందని బోలె షావలి అన్నారు. ఇంత మంచి చిత్రం నిర్మాణంలో భాగస్వామయ్యే అవకాశం లభించడం పట్ల చిత్ర సమర్పకులు ఎర్రోజు వెంకటాచారి, సహ నిర్మాత జి.శ్రీనుగౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల తేజేశ్వరావు(కన్నారావు) గారికి కృతజ్ఞతలు తెలిపారు.