టీజర్ చూసారా…మైండ్ బ్లోయింగ్

వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. ఈ  చిత్రం షూటింగ్ రీసెంట్ గా  కంప్లీట్
చేసుకుంది. తొలి చిత్రం  ‘ఘాజి’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు. టీజర్ చూసిన వారంతా మైండ్ బ్లోయింగ్ అని మెచ్చుకుంటున్నారు.


హై టెక్నికల్ వేల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్‌ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్‌ చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాని ఒక విభిన్నమైన కాన్సెఫ్ట్‌తో వస్తున్న చిత్రం కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే కావటం విశేషం.

 జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి‌.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.