ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎదో ఒక అప్ డేట్ తో సోషల్ మీడియాలో నానుతూనే ఉన్నది. నిజానికి ఏ సినిమా అనౌన్స్ కీ రానంత హైప్ ఈ సినిమాకు వచ్చింది. దానికి కారణాలు బోలెడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్ట్ గా నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా కావడం ఒక ఎత్తు అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తీస్తుండటం మరో ఎత్తు. 3డీ ఫార్మాట్ లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మొత్తానికి ఈ సినిమా యావత్తు భారతదేశ సినీ ఇండస్ట్రీలోనే ఓ చరిత్రగా మిగిలిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ ఈ సినిమా సబ్జెక్ట్ చాలా డిఫరెంట్. రామాయణ ఇతిహాసాన్ని తీసుకొని ఈ సినిమాను తీస్తున్నారు. ముందుగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ తర్వాత సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే పక్కాగా ఈ సినిమా రామాయణాన్ని బేస్ చేసుకొని ఉంటుందని అనుకున్నారు.
ఆ తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. వావ్.. సూపర్.. ప్రభాస్ రాముడిగా కనిపించడం అంటే ఇక సినిమా మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే అని ప్రభాస్ అభిమానులు మెలికలు తిరిగిపోయారు. బడ్జెట్ కూడా 1000 కోట్లు అంటూ ప్రకటించారు. ఇలా ఆదిపురుష్ కు సంబంధించిన చాలా అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి.
అయితే.. తాజాగా వచ్చిన అప్ డేట్ మాత్రం అతి ముఖ్యమైనది. దీంట్లోనే ఉన్న మరో గుట్టు తెలిసిపోయింది. నిజానికి ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగానే నటిస్తున్నా.. పూర్తి స్థాయిలో సినిమా మొత్తం రాముడిగా ఉండరు అని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమా రామాయణాన్ని బేస్ చేసుకొని వస్తున్న సినిమా కానీ.. పుర్తిస్థాయిలో రామాయణం అందులో ఉండదు. పూర్తిస్థాయి రామాయణం కాదు. అంతే కాకుండా… ప్రభాస్ సినిమా మొత్తం రాముడిగా కాకుండా.. కొంతసేపు మాత్రమే రాముడిగా కనిపించబోతున్నారు అని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొద్దిసేపే అంటే ప్రభాస్ కి సపరేట్ కాస్ట్యూమ్స్ ఇచ్చి గెటప్ వేయిస్తారా? లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ప్రభాస్ ని రాముడిగా చూపిస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అంతే కాదు.. ఈ సినిమాలో రామాయణం కంటే ముందు ఉన్న చాలా చరిత్రలో నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నట్టు బాలీవుడ్ టాక్.
అసలు.. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. ఏది ఏమైనా.. ప్రబాస్ ఆదిపురుష్ సినిమా గురించి ఫుల్లు క్లారిటీ రావాలంటే మాత్రం మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.