పెళ్లి గోల వెబ్ సిరీస్‌తో ఫుల్ ఫేమస్ అయిన వర్షిణి.. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్‌గా దూసుకుపోతోంది. మొదట్లో కాస్త తింగరిదని అందరూ టార్గెట్ చేస్తూ ఎగతాళి చేసేవారు. వచ్చీ రానీ స్టెప్పులు వేస్తూ అందరి ముందు నవ్వుల పాలయ్యేది. కానీ రాను రాను తనను తాను మెరుగు పరుచుకుంటూ బుల్లితెరపై తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. టాప్ యాంకర్ రేసులోనూ వర్షిణి దూసుకుపోతోంది.
ఢీ, పటాస్, జబర్దస్త్ వేదికలపై వర్షణిని ఎంతలా ఆడుకునేవారో అందరికీ తెలిసిందే. మూన్ వాక్ స్టెప్ అంటూ సుధీర్, శేఖర్ మాస్టర్‌లు సెటైర్ కూడా వేసేవారు. కానీ ప్రస్తుతం వర్షిణి డ్యాన్సుల్లోనూ మేటి అనిపించుకుంటుంది. ఇక ప్రస్తుతం ఢీ వేదికపై హైపర్ ఆదితో చేసే రొమాన్స్‌కు ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది. ఒకానొక దశలో వీరిద్దరికి పెళ్లి అంటూ యూట్యూబ్‌లో లెక్కలేనన్ని వార్తలు,వీడియోలు పుట్టుకొచ్చాయి.
సోషల్ మీడియాలో వర్షిణికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆ రూమర్లన్నీ క్షణాల్లో వైరల్ అయ్యేవి. ప్రస్తుతం వర్షిణి ఓ వ్యక్తి బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు వాపోయింది. తన రూంలోకి వచ్చి అంతా చిందరవందర చేస్తోందని తన గోడును వివరించింది. ఇంతకీ ఆ సంగతేంటంటే.. తన మేనకోడలు రూంలోకి వచ్చిన మేకప్ కిట్‌ను నాశనం చేస్తోందట. తన మేకప్ వస్తువులతో మొహం నిండా పూసుకుంటోందట. ఈ వీడియోను వర్షిణి పోస్ట్ చేస్తూ.. ఇప్పుడే ఆమెకు మేకప్ ఎంత శ్రద్ద ఉందో కదా అని ఆశ్చర్యపోయింది.