బుల్లి తెర యాంకర్ అనసూయ భరద్వాజ్ ఓ ఆసక్తికరమైన ట్విట్ చేశారు. హైద్రాబాదు రోడ్ ల పై నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న ఓ వ్యక్తి వీడియోను ట్విట్ చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులను కోరారు. బుధవారం జులై 18న రాత్రి అనసూయ తన కారు లో బంజారాహిల్స్ రోడ్ నం.2 దారిలో ప్రయాణిస్తుండగా అదే దారిలో ఓ వ్యక్తి ఇయర్ ఫోన్స్ తగిలించుకొని సెల్ ఫోన్ లో వీడియోలు చూస్తూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. అనసూయ తన ఫోన్ అందుకొని ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ నగర ట్రాఫిక్ పోలీసులకు టాగ్ చేసారు. డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్… ఇతరుల తప్పిదంతో నేను ఇది వరకే ఒకసారి ప్రమాద బారిన పడ్డాను. దయచేసి ఇలాంటి నిర్లక్ష్యపు చోదకులను వదిలేయకండి. రోడ్ల పై తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే
ఇలాంటి వారికి ప్రాణాలు అంటే లెక్క లేదా అని అనసూయ ట్విట్ చేశారు. ఈ ట్విట్ పై నెటిజన్లు ఎవరికీ తోచిన విదంగా వారు కామెంట్లు పెడుతున్నారు. కొంపదీసి మీరు స్టెరింగ్ వదిలి ఆ వీడియో తీయలేదుగా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా
నాకు డ్రైవింగ్ రాదు అని అనసూయ బదులు ఇచ్చారు. నిర్లక్యపు డ్రైవింగ్ ఘటన జరిగిన ప్రదేశం ట్విట్ చేసిన అనసూయ ఆ కార్ నెంబర్ చెప్పక పోవడం గమనార్హం.
2017 మే లో అనంతపురంలో అనసూయ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో అనసూయ తలకు గాయం అయింది. ప్రమాదం నుంచి అనసూయతో పాటు కుటుంబ సభ్యులంతా సురక్షితంగా బయట పడ్డారు. అందు వలనే ఈ వీడియో తీసి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది అనసూయ.
వీడియో కోసం కింద క్లిక్ చేయండి