Anchor Anasuya: నోట్లో బ్లేడుతో మంగళం శీను మీదికెక్కి రచ్చ చేస్తున్న దాక్షాయిని..!

Anchor Anasuya: సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఇందులో రష్మిక అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా విలన్ పాత్రలో అనసూయ, సునీల్ నటిస్తున్నట్లు తెలిసిందే. ఇందులో సునీల్ మంగళం శీను పాత్రలో సందడి చేయగా అనసూయ దాక్షాయిని పాత్రలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే డిసెంబర్ ఆరో తేదీ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.

Anchor Anasuya Attacked Mangalam Senu With Blade In Pushpa Trailer | Telugu Rajyamఈ క్రమంలోనే పుష్ప ట్రైలర్ టీజర్ పేరిట ఒక చిన్న శాంపిల్ వీడియోని విడుదల చేశారు. ఇందులో రష్మిక తో పాటు అనసూయ సునీల్ కనిపించారు. ఇక ఈ సినిమాలో అనసూయ ఎంతో వైల్డ్ పాత్రలో కనబడుతుంది. ఈమె మాస్ లుక్ లో ఏకంగా నోటిలో బ్లడ్ పెట్టుకొని మంగళం శీను పై ఎక్కి తనని భయపెడుతూ ఉన్నట్టు ఉండడంతో అనసూయ పాత్రపై ఎన్నో అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో అనసూయ సునీల్ భార్యగా కనిపించనుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఇక సుకుమార్ దర్శకత్వంలో రంగమ్మత్త పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా మాస్ క్యారెక్టర్లో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఎన్నో పోస్టర్లు, పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే పుష్ప సినిమా మొదటి పార్ట్ డిసెంబర్ 17వ తేదీ ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles