‘దొరసాని’టీజర్ ఎలా ఉందంటే…

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ‘దొరసాని’ చిత్రంతో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ‘దొరసాని’అంటూ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పటినుంచీ ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. వాటిని మరింత పెంచటానకా అన్నట్లు ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Dorasaani Official Teaser II Anand Deverakonda II Shivathmika Rajashekar II K V R Mahendra

తెలంగాణలోని ఒకప్పటి గడీల కాలంలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ బాగానే ఆకట్టుకుంటోందనే చెప్పాలి. అయితే ఓ దొర కూతురుకి, ఓ సామాన్య కుర్రాడుకి మధ్య జరిగే లవ్ స్టోరీ అని అర్దమవుతోంది. తేజ మార్క్ చిత్రంలా ఈ సినిమా ఉండబోతోందని కామెంట్స్ వినపడుతున్నాయి. టీజర్ వరకూ అయితే పెద్ద కొత్తగా అయితే లేదు.

ఈ టీజర్‌లో.. మీ పేరు అని శివాత్మిక అని అడిగితే ‘రాజు’ అని చెప్పి.. ‘మీరు దొరసాని’ అని హీరో అనడం.. వెంటనే శివాత్మిక ‘కాదు దేవికా’ అని అనడం.. వెంటనే ‘కాదు మీరు నా దొరసాని’ అని ఆనంద్‌ ఆనడం ఆకట్టుకుంది.

అలాగే ఆనంద్‌ డైలాగ్‌ డెలివరీలో కూడా తన అన్న విజయ్‌ మాడ్యులేషన్‌ కనబడటం ప్లస్‌ అయ్యేలా కనిపిస్తోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతాన్ని అందించారు.