Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల అయ్యేది అప్పుడే!

Akhanda 2: డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా అఖండ. 2021 లో విడుదల అయిన అఖండ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన అఖండ పార్ట్ 1 సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటుగా భారీగా కలెక్షన్స్ ని కూడా సాధించింది.

దాంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. అఖండ 2 సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కాగా నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ చిత్రం అఖండ 2. సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో మెప్పించిన బాలయ్య ఇప్పుడు అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ జార్జియా దేశంలో జరుగుతోంది. అఖండ సినిమాకు సీక్వెల్ కావడం, బాలయ్య,బోయపాటి కాంబోలో నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ అప్డేట్ ను ఇచ్చారు మూవీ మేకర్స్. అదేంటంటే అఖండ 2 టీజర్ రేపు జూన్ 9 సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. టీజర్ తాండవం చేయబోతుంది అంటూ త్రిశూలంతో ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. మరి టీజర్ ఎలా ఉంటుంది ఏంటి అన్న వివరాలు తెలియాలి అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే మరి.