ఆనంద్ దేవరకొండ రెడీ అవుతున్నాడట

ఆనంద్ దేవరకొండ రెడీ అవుతున్నాడట

“దొరసాని” సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ప్రవేశించిన ఆనంద్ దేవరకొండ ఆశించినవిధంగా ఆ చిత్రం ఆడలేదు . తొలి చిత్ర హీరోగా అతనికి హీరోయిన్ గా శివాత్మిక మంచి పేరే సంపాదించారు . అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని స్వంతం చేసుకోలేదు . ఆ చిత్ర దర్శకుడు మహేంద్రకు కూడా అదే తొలి సినిమా కాబట్టి సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దలేదు . ఇప్పుడు ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా మొదలు పెట్టె పనుల్లో ఉన్నట్టు తెలుస్తుంది . మొదటి సినిమా “దొరసాని” అనుభవంతో రెండవ సినిమాను తన ఏజ్ కు తగ్గట్టు రూపొందించుకోవాలి ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు .

వినోద్ అనే దర్శకుడు ఆనంద్ కు కథను తయారు చేసే పనుల్లో వున్నాడట . ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ వారు నిర్మించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఫిలిం నగర్ వర్గాల వార్త. మొత్తానికి తొలి చిత్ర అనుభవంతో రెండవ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు .