సూర్య తేజ ఏలే డెబ్యు మూవీ ‘భరతనాట్యం’. దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ సరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు కానుంది. నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ శివాత్మిక, జీవిత రాజశేఖర్, నవదీప్, దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, విరించి వర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మధుర శ్రీధర్, లగడపాటి శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..‘భరతనాట్యం’ ప్రమోషనల్ కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. చాలా ఆసక్తికరమైన కథ ఇది. చాలా మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తున్నారు. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఎడిటర్ రవితేజ నా ఫేవరేట్ ఎడిటర్. నిర్మాతలు పై పాయల్ సరాఫ్, హితేష్ గారికి ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. దొరసాని సినిమా మా అందరికీ చాలా మంచి పేరు తీసుకొచ్చింది. దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, నేను, శివాత్మిక.. ఇలా దాదాపు అందరం కొత్తవాళ్లతో ఆ సినిమా చేశాం. ఆ సినిమా మా అందరి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచింది. ఇదే నమ్మకంతో చెబుతున్నా… ‘భరతనాట్యం’ సినిమా కూడా సూర్య తేజ తో పాటు సినిమా యూనిట్ అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తుంది. కెవిఆర్ మహేంద్ర ని మా అన్నలా భావిస్తాను. కెవిఆర్ మహేంద్ర అన్న విషయంలో ఎప్పుడూ గర్వంగా ఫీలౌతాను. ‘భరతనాట్యం’ కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ధని ఏలే గారు పాతికేళ్ళు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5న ..’భరతనాట్యం’, ఫ్యామిలీ స్టార్ సినిమాలు వస్తున్నాయి. రెండు సినిమాలని చూసి ఎంజాయ్ చేయండి. అన్నీ సినిమాలు విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మన ఇండస్ట్రీ బావుండాలి. మనమంతా బావుండాలి’ అన్నారు.
హీరో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలని మా దర్శకుడు చెప్పేవారు. మా సినిమాకి ఆ నేచర్ హితేష్ గారు. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. మాపై చాలా నమ్మకంతో ఈ సినిమా చేశారు. ‘భరతనాట్యం’ మా టీం సమిష్టి కృషి. వివేక్ సాగర్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. ఎడిటర్ రవితేజ గారు చాలా సపోర్ట్ చేశారు. డీవోపీ వెంకట్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సురేష్ గారు చాలా మంచి ఆర్ట్ వర్క్ చేశారు. నాన్న (ధని ఏలే) గారు నా కంటే ఎక్కువ కష్టపడ్డారు. ఆయన పాతికేళ్ళుగా పరిశ్రమలో వున్నారు. పరిశ్రమలో ఆయన అందరిప్రేమని సంపాదించారు. డైరెక్షన్ టీంతో పటు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆనంద్, శివాత్మిక, జీవితగారు, నవదీప్ .. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పాయల్ గారి సపోర్ట్ వలనే ఇక్కడి వరకూ వచ్చాం. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. మీనాక్షి చాలా కష్టపడింది. తను పెద్ద హీరోయిన్ అవుతుంది. దర్శకుడు కెవిఆర్ మహేంద్ర అన్న సినిమాని అద్భుతంగా తీశారు. ఇందులో ఆయనలోని వైలెన్స్ ని చూస్తారు. ఏప్రిల్ 5న వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది.” అన్నారు.
దర్శకుడు కెవిఆర్ మహేంద్ర మాట్లాడుతూ.. ఆనంద్, శివాత్మిక ఈ వేదికపై వుండటం చాలా ఆనందంగా వుంది. దొరసాని సినిమా విజయంలో వారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. విజయ్ దేవరకొండ గారి సినిమా ఏప్రిల్ 5న విడుదలౌతుంది. కానీ ఆనంద్ మా సినిమా ఈవెంట్ కి వచ్చాడు. లవ్ యూ.. తమ్ముడు. లవ్ యూ దొరసాని. శివాత్మిక లాంటి అద్భుతమైన నటిని జీవితంలో చూడలేనేమో. ఇప్పుడు అదే దారిలో సూర్య తేజ, మీనాక్షి ‘భరతనాట్యం’తో వస్తున్నారు. అదే మ్యాజిక్ జరగబోతుంది. పాయల్ గారిని చూస్తుంటే మా అమ్మని చూసినట్లు అనిపిస్తుంది. మాపై నమ్మకంతో చాలా సపోర్ట్ చేశారు. ఇది చాలా పెద్ద బ్యానర్ అచ్వుతుంది. ‘భరతనాట్యం’ సినిమాని చాలా ఎంటర్ టైనింగ్ హ్యుజ్ వరల్డ్ క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. ఎక్కడకూడా కొత్త హీరో సినిమాలా అనిపించదు. సినిమా మొదలైన ఐదు నిమిషాల తర్వాత ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మీనాక్షి పాత్ర కోసం తపన పడే నటి. వైవా హర్ష ఇందులో చెలరేగిపోయారు. హర్ష వర్ధన్, అజయ్ ఘోష్, కృష్ణుడు గారు అంతా ఈ సినిమా స్కేల్ ని పెంచారు. వివేక్ సాగర్ మ్యూజిక్ మరోస్థాయిలో వుంటుంది. వెంకట్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఆద్యంతం కడుపుబ్బా నవ్వించేలా వుంటుంది. డార్క్ కామెడీ హిలేరియస్ గా వుంటుంది. ‘భరతనాట్యం’ సమ్మర్ సినిమాల్లో ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది. ఏప్రిల్ 5న సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామిస్” అన్నారు.
సీనియర్ నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..‘దొరసాని’ సినిమాలో చేసిన ఆనంద్, శివాత్మిక, మహేంద్ర.. వీరందరినీ ఒక్క చోట చూడటం చాలా ఆనందంగా వుంది. మహేంద్ర గారి వర్క్ ని చాలా ఇష్టపడతాను. తను అనుకున్నది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. సూర్య చాలా ప్రతిభావంతుడు. పాయల్ గారు ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్ధమౌతుంది. మీనాక్షి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
హీరోయిన్ శివాత్మిక మాట్లాడుతూ.. ఈవేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. దొరసాని పాత్ర ఇచ్చిన మహేంద్ర గారికి రుణపడి వుంటాను. మహేంద్ర గారు కామెడీ థ్రిల్లర్ జోనర్ సినిమా చేయడం నాకు చాలా సర్ ప్రైజింగ్ గా వుంది. ట్రైలర్ చాలా సరదాగా వుంది. సూర్య తేజ, మీనాక్షి.. టీం అందరికీ ఆల్ ది బస్ట్. ఏప్రిల్ 5న అందరూ భరతనాట్యం చూసి సినిమాకే పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ..అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. భరతనాట్యంలో నా పాత్ర చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సూర్య వండర్ ఫుల్ కో యాక్టర్. ఈ సినిమా చాలా బావొచ్చింది. తప్పకుండా సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.
నిర్మాత పాయల్ సరాఫ్ మాట్లాడుతూ.. ఈ వేడుకు వచ్చిన అతిధులందరికీ ధన్యవాదాలు. భరతనాట్యం లో బ్లాక్ బస్టర్ కంటెంట్ వుంది. తప్పకుండా సినిమా చూడండి. మీ అందరి సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ నాకు మరో సినిమా చేసే బలం ఇస్తుంది’’ అన్నారు.
హీరో నవదీప్ మాట్లాడుతూ.. భరతనాట్యం కంటెంట్ చాలా ఆసక్తికరంగా వుంది. ట్రైలర్ చూడగానే చాలా ఫన్ ఫిల్మ్ అనిపించింది. మహేంద్ర గారు చాలా డిఫరెంట్ ఫిలిం తో వస్తున్నారు, వివేక్ సాగర్ మ్యూజిక్ చాలా అద్భుతంగా వుంది. సూర్య తేజ, మహేంద్ర గారు.. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. భరతనాట్యం విజువల్స్ చాలా నచ్చాయి. నా మొదటి సినిమా భలే మంచి రోజు గుర్తుకు వచ్చింది. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. మహేంద్ర చాలా యూనిక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. సూర్య లో చాలా పాషన్ వుంది. వివేజ్ సాగర్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ.. ధని ఏలే గారి అబ్బాయి సూర్య తేజ హీరోగా పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది. టైటిల్ టీజర్ చాలా ఆసక్తికరంగా వున్నాయి. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ తెలిపారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. భరతనాట్యం నిర్మాతలు పాయల్ హితేష్ నాకు మంచి స్నేహితులు. చాలా యంగ్ టీంతో సినిమా చేశారు. సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేంద్ర వర్క్ నాకు చాలా ఇష్టం. దొరసానిలో చాలా అద్భుతమైన పని తీరు కనబరిచారు. భరతనాట్యం ట్రైలర్ చాలా బావుంది. ధని ఏలే గారి అబ్బాయి హీరోగా లాంచ్ అవుతున్నారంటే మన సొంత మనిషి లాంచ్ అవుతున్న ఫీలింగ్. ఈ సినిమా మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను.
ధని ఏలే మాట్లాడుతూ.. నిర్మాతలు పాయల్ హితేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రాజీపడకుండా సినిమాని నిర్మించారు. మహేంద్ర గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.