వైరల్ ఫొటో : నిశ్చితార్దం అయ్యాక…బికినీ ఫొటో వదిలిందే

రజనీకాంత్‌ 2.0 లో యంత్ర లోకపు సుందరిగా దుమ్ము రేపిన అమీ జాక్సన్‌ త్వరలో వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం తొలిరోజున నిశ్చితార్ధం జరుపుకున్న ఆమె పెళ్లి పనుల్లో బిజీ అవుతుందనుకున్నారంతా. అయితే ఆమె తన హాట్ బాడీని ఎక్సపోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు అప్ లోడ్ చెయ్యటంలో బిజీగా ఉంది.

ఇప్పటికే ఎన్నో హాట్ ఫొటోలు వదిలి కుర్రకారు మనస్సుని గేలం వేసి పట్టుకున్న ఆమె ఇప్పుడు మరో సారి బికినీతో ఉన్న ఫొటోతో దుమ్ము రేపుతోంది. ఇక్కడ మీరు ఆ ఫొటోను చూడవచ్చు. ఈ ఫొటోని రీసెంట్ గా ఇనిస్ట్రగ్రమ్ లో పోస్ట్ చేస్తే.. 1.3 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం తన బోయ్ ఫ్రెండ్,కాబోయే భర్తతో కలిసి ఆమె జాంబియాలో వెకేషన్ లో ఉంది.

బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనయటోతో జాంబియాలో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసిఉన్న ఫోటోను అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో రెండు రోజుల క్రితం ఆమె పోస్ట్‌ చేశారు.

ఈ సంవత్సరం మొదటి రోజున మన జీవితం ప్రారంభవుతోంది..అత్యంత సంతోషంగా తనను ఉంచుతున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తెలుగులో ఎవడు, అభినేత్రి చిత్రాల్లో మెప్పించిన అమీ జాక్సన్‌ 2.ఓలో నటనకు గాను పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు.