కొన్ని చిత్రాలు ప్రకటించగానే బిజినెస్ ప్రారంభమైపోతుంది. అలాంటి వాటిల్లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి. సినిమాలో ఏం చూపించినా, ఏం చూపించకపోయినా ఎన్టీఆర్ పై ఇప్పటికి తెలుగు వారికి ఉన్న అభిమానం..వారిని థియోటర్స్ కు రప్పిస్తుందనటంలో సందేహం లేదు. అది గమనించిన ట్రేడ్ ..ఈ సినిమాపై మొదటి నుంచీ అసక్తి చూపిస్తూ వస్తోంది. ఎలాగో థియోటర్ రైట్స్ ,, శాటిలైట్ రైట్స్ భారీ ఎత్తున వెళ్తాయి.
ఓవర్‌సీస్‌లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు డిజిటల్ రైట్స్ కు కూడా ఓ రేంజిలో పోటీ ఏర్పడింది.
తెలుగు డిజిటల్ మార్కెట్ ని శాశిస్తున్న అమెజాన్ ప్రైమ్ …ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని భారీ మొత్తానికి అంటే దాదాపు 15 కోట్లకు అడుగుతున్నట్లు సమాచారం. ఓ ప్రక్కన నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ కూడా పోటికి దిగటంలో ఈ రేటు పలుకుతున్నట్లు సమాచారం. దాంతో ఓవర్ సీస్, డిజిటల్ రైట్స్ కలిపితి 35 కోట్లు పలుకుతాయి. బాలయ్య ఏ సినిమా కు ఈ స్దాయి బిజినెస్ జరగలేదు. దాంతో దర్శక,నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నట్లు చెప్తున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికు క్రిష్ దర్శకుడు. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ బయోపిక్ కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు.