ట్రైలర్‌ చూస్తూంటే సునీల్ ని బాగానే వాడినట్లున్నారే..

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఇలియానా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. చిత్రం రిలీజ్ కు దగ్గరపడటంతో ..ఈ రోజు ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్ ఇదో రివేంజ్ స్టోరీ అని క్లూ ఇస్తూ సాగింది. ‘ఇది రివెంజ్‌ కాదు రిటర్న్‌ గిఫ్ట్‌’ ముగించి దర్శకుడు సినిమాపై అంచనాలు పెంచాడు.

“ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వాళ్లు కొందరుంటే శక్తి మేరకు నయవంచన చేసేవాళ్లు కోకొల్లలు“ అంటూ శ్రీను వైట్ల చెప్పే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బావుంది. అలాగే ఈ ట్రైలర్ చూస్తూంటే సినిమాలో సునీల్ క్యారక్టర్ కు కూడా బాగానే సీన్స్ ఉన్నాయని అర్దమవుతుంది.

Amar Akbar Anthony Theatrical Trailer | Ravi Teja | Ileana | Sreenu Vaitla | Thaman | Sreenu Vaitla

‘ఈ ప్రపంచంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేనివారు కొందరు ఉంటే..శక్తిమేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఇంట్రస్టింగ్ ఉంది. ‘ఐయామ్‌ ఆంటోనీ, మార్క్‌ ఆంటోనీ’ అని రవితేజ తనని తాను పరిచయం చేసుని…ఇలియానాను పరిచయం చేస్తూ..‘షి ఈజ్‌ థెరిస్సా..మదర్‌ థెరిస్సా’ అని చెప్పడం బాగుంది.

ఇక తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో ఇలియానా తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.