అల్లు శిరీష్ కు ఏం కష్టాలు వచ్చాయిరా సామీ

అల్లు శిరీష్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఏబీసీడీ’. మలయాళంలో హిట్టయిన ఏబీసీడీ సినిమాక్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మధుర శ్రీధర్, యాష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ద్వారా సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ నేఫద్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు.

ABCD - Release Trailer | ABCD On May17 | #AmericanBornConfusedDesi | Allu Sirish | Rukshar

మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో మూవీ రిలీజ్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైలర్ లోని సన్నివేశాలు ఫ‌న్నీగా ఉన్నాయి. ఈ మూవీ శిరీష్‌కి మంచి హిట్ అందించ‌డం ఖాయ‌మ‌ని టీం అంటోంది. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

కన్నడ సంగీత దర్శకుడు జుదా సాంధీ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శిరీష్‌కు స్నేహితుడిగా మాస్టర్ భరత్ నటిస్తున్నారు. మలయాళంలో దుల్కర్ నటించిన పాత్రలో శిరీష్ కనిపించనున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు.