అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘ఏబీసీడీ’ చిత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీ చిత్రంను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ చేసారు కానీ కలిసి రాలేదు. కెరీర్ ప్రారంభం నుంచి ప్లాఫ్ ల్లో ఉన్న శిరీష్ కు ఈ సినిమానూ నిరాశే మిగిల్చింది. మంచి ఎక్సపెక్టెషన్స్ తో రూపొందిన ఈ సినిమా తొలి రోజు 2.25 కోట్ల గ్రాస్ దక్కింది. పెట్టిన పెట్టుబడితో పోలీస్తే ఈ కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ.
దాంతో ఈ వీకెండ్ కూడా కలెక్షన్స్ వైజ్ గా మహర్షి డామినేట్ చేసేసింది. నటుడిగా… శిరీష్ కొన్ని మంచి మార్కులు వేయించుకున్నా, వెన్నెల కిషోర్ కామెడీ వర్కవుట్ అయినా – కథ,కథనం, దర్శకతక్వం విషయంలో పూర్తిగా విఫలమయ్యింది. సినిమాలో స్టోరీ లైన్ కు తగ్గ ఫన్ రాకపోవడం,సెకండాఫ్ మరీ బోరింగ్‌గా సాగడం ఈ సినిమాని భాక్సాఫీస్ వద్ద దెబ్బ కొట్టాయి. దాంతో శిరీష్ ఖాతాలో మరో ఫ్లాప్ వచ్చి చేరింది.
ఇక ఏబీసీడీతో పాటు మరో రెండు చిన్న సినిమాలు ఈ వారం విడుదలయ్యాయి. రొమాంటిక్ క్రిమినల్స్, స్వయంవధ.. ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటిని ఏమాత్రం ఎవరూ పట్టించుకున్న ధాకలా లేదు. అసలు ఈ సినిమాలు ఏ థియేటర్లో ఆడుతున్నాయో కూడా ఎవరూ ఎంక్వైరీ చేయలేదు.
దాంతో ఓ రీమేక్ కథని ఎంచుకుని రిస్క్ లేని హిట్ కొడదామనుకున్న శిరీష్ ప్రయత్నానికి గట్టి దెబ్బ తలిగింది. ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.