అల్లు అర్జున్ ..నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా రిలీజ్ తర్వాత కొత్తగా ఏ సినిమా కమిటవ్వలేదు. ఆ సినిమా ప్లాఫ్ కావటంతో సరైన స్క్రిప్టుతో ముందుకు వెళ్లాలని ఆయన ఫిక్స్ అయ్యారు. అందుకోసం రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఆ మధ్యన లింగు సామితోనూ, విక్రమ్ కుమార్ తోనూ సినిమాలు అనుకున్నారు కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. అయితే అరవింద సమేత వీరరాఘవ రిలీజ్ అయిన తర్వాత….త్రివిక్రమ్ తో ఆయన
ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ..ఓ రీమేక్ అయితే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా మరేదో కాదు..రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్టైన రొమాంటిక్ కామెడీ మూవీ ‘సోను కే టిటు కీ స్వీటీ’.
లవ్ రంజన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం పేరున్న ఆర్టిస్ట్ లు.. టెక్నీషియన్లు లేకపోయినప్పటికీ.. కేవలం కంటెంటుతోనే ప్రేక్షకుల్నిమెస్మరైజ్ చేసి భారీ వసూళ్లతో ముందుకు దూసుకెళ్తోంది. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో సాగే ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.
ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్.. నుష్రత్ భరూచా.. సన్నీ నిజార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది. ఈ చిత్రం యూత్ ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ‘పద్మావత్’.. ‘ప్యాడ్ మ్యాన్’ల తర్వాత ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న ‘సోను కే టిటు కీ స్వీటీ’.. త్వరలోనే తెలుగులో వచ్చే అవకాసం ఉంది. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకూ ఒక్క రీమేక్ కూడా చెయ్యలేదు. దాంతో మరి ఈ రీమేక్ కు ఓకే చెప్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.