`పుష్ప` రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు?
అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేయడంతో అనూహ్యంగా బన్ని ప్లాన్స్ మారిపోయాయి. నా పేరు సూర్య ఇచ్చిన ఝలక్ నుంచి వేగంగానే బయటపడగలిగాడంటే త్రివిక్రమ్ ని నమ్మడం వల్లనే. అల వైకుంఠపురములో తర్వాత బన్ని కెరీర్ 20వ చిత్రంగా పుష్ప (ఏఏ20) ప్రారంభమైంది. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారీ వల్ల అంతకంతకు సెట్స్ కి వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈ సినిమాని అనుకున్నది అనుకున్నట్టుగా షూట్ చేయగలరా? అన్న సందిగ్ధత తాజాగా వ్యక్తమవుతోంది.
మహమ్మారీ దెబ్బకు ప్లాన్స్ అన్నీ గల్లంతయ్యాయి. దీంతో సుకుమార్ ఆశించినంత బడ్జెట్ ని మైత్రి వాళ్లు పెడతారా లేదా? అన్న సందిగ్ధత నెలకొందట. ప్రస్తుత కల్లోలంలో భారీ అతిభారీ బడ్జెట్లు వర్కవుటవుతాయా? అన్నది సందిగ్ధంలో పడింది. పైగా అనుకున్న లొకేషన్లు దొరక్క సెట్లు వేసి భారీ బడ్జెట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పర్యవసానం బన్ని ఆలోచనల్ని చిద్రం చేసిందని బడ్జెట్లకు చిల్లు పెట్టిందని చెబుతున్నారు. పుష్ప రా మెటీరియల్ ఉన్న రస్టిక్ కంటెంట్ ఉన్న సినిమా. ఇందులో బన్ని స్మగ్లర్ గా బిజినెస్ మేన్ గా .. మంచోడిగా రకరకాలుగా కనిపిస్తాడని అతడి క్యారెక్టర్లు తెలుగు నేటివిటీ కంటే తమిళ తంబీలకు బాగా కనెక్టవుతుందని చెబుతున్నారు.
తెలుగు, మలయాళం, కన్నడలో ఫాలోయింగ్ ఉంది ఇప్పటికే. ఇక తమిళుల ఫాలోయింగ్ దక్కితే టోటల్ సౌత్ ని ఆక్రమించి అటుపై పాన్ ఇండియా స్టార్ గా హిందీలోనూ వర్కవుట్ చేయాలని అనుకున్నాడు. కానీ అతడికి మహమ్మారీ కరోనా రూపంలో పంచ్ పడిపోయింది. ఇది ఊహించనిది. ఇండస్ట్రీ హిట్టు అన్న మూవ్ మెంట్ తో దూసుకుపోవాలనుకుంటే ఇంకేదో అయ్యింది. ఇప్పుడేం చేయాలి? అన్న డైలమా కొనసాగుతోందట.
ఇంతకీ పుష్ప రెగ్యులర్ చిత్రీకరణ ఎప్పటికి మొదలవుతుంది? ఎప్పటికి పూర్తవుతుంది? పుష్ప మార్కెట్ స్ట్రాటజీ ఏమిటి? అన్నదానిపై ఇంకా క్లారిటీనే లేదని చెబుతున్నారు. మరి బన్ని కూడా ప్రభాస్ లా పాన్ ఇండియా స్టార్ అయ్యేదెపుడు? అన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు.