సిని పరిశ్రమ చిత్రమైనది. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో ఎవరూ అంచనా వెయ్యలేరు. చాలా సార్లు తాము రిజెక్టు చేసిన ప్రాజెక్టులు వేరే వాళ్లు టేకప్ చేసి పెద్ద కొట్టచ్చు. అలాగే ఎంతో నమ్మకంతో చేసిన సినిమా డిజాస్టర్స్ అవ్వచ్చు. అది అందరి హీరోలకు అనుభవమే. రీసెంట్ గా అల్లు అర్జున్ ఓ కథ నో చెప్పాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదని వద్దనేసాడు. అయితే ఆ కథకి విజయ్ దేవరకొండ యస్ చెప్పి ప్రాజెక్టుకు పిచ్చ హైప్ తెచ్చాడు. ఆ సినిమానే నోటా. దాంతో ఇఫ్పుడు అల్లు అర్జున్ దృష్టి మొత్తం నోటా పైనే ఉంది.
తను నో చెప్పిన ప్రాజెక్టు హిట్ అయితే ఏ స్దాయిలో దాని ప్రభావం ఉంటుంది. తన అంచనా తప్పిందా..లేక తను కరెక్ట్ గానే ఆలోచించానా అని అల్లు అర్జున్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు తమ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీతా గోవిందం టైటిల్ తో విజయ్ దేవరకొండ పెద్ద హిట్ కొట్టారు. ఆ ప్రభావం సైతం నోటా ఉంటుంది. ఓపినింగ్స్ బాగుంటాయి. ఏ మాత్రం బాగున్నా సినిమా ఘన విజయం సాధించేస్తుంది. ఏదైమైనా అల్లు అర్జున్ కు తన సినిమా కోసం కాకుండా వేరే హీరో సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూడటం అంటే చెప్పుకోదగ్గ విషయమే.
‘అరిమానంబి’, ‘ఇరుముగన్’ చిత్రాల తర్వాత ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నోటా’. తెలుగులో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా తమిళ తెరకు పరిచయం అవుతున్నారు. సంచన హీరోయిన్. యాషిక ముఖ్యపాత్ర పోషించారు. నాజర్, సత్యరాజ్, ఎం.ఎస్.భాస్కర్, కరుణాకరన్‌లు ఇతర తారాగణం. అక్టోబరు అయిదో తేదీన ఈ సినిమా విడుదల కానుంది.