ప్రతీ నిర్మాత, దర్శకుడుకు తనకంటూ నచ్చే హీరో,హీరోయిన్స్ ఉంటారు. అయితే వాటిని బయిటపెడితే మిగతా వాళ్లు బాధపడతారని చెప్పుకోరు. కానీ దిల్ రాజు ఆ స్టేజ్ దాటి పోయారు. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఓ యూట్యూబ్ ఇంటర్వూలో మాట్లాడుతూ..అల్లు అర్జున్ తనకు తెలినంతలో తెలుగులో బాగా హార్ట్ వర్క్ చేసే హీరో అని తేల్చి చెప్పారు. అల్లు అర్జున్, దిల్ రాజు కాంబోలో గతంలో ఆర్య, పరుగు, రీసెంట్ దువ్వాడ జగన్నాథం చిత్రాలు వచ్చి విజయం సాధించాయి.
ఇక ప్రస్తుతం దిల్ రాజు తన తాజా సంక్రాంతి చిత్రం ‘F2’సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ సంవత్సరం ఆయన వరస సినిమాలు నిర్మిస్తున్నారు. మినిమం నాలుగు నుంచి ఐదు హిట్ సినిమాలు తన బ్యానర్ నుంచి ఈ సంవత్సరం వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా మహర్షి సినిమాపై ఉంది.
అలాగే ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ’96’ సినిమాని రీమేక్ చేస్తున్నారు. త్రిష .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. 1996లో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
రిలీజ్ కు ముందే చెన్నై వెళ్లి స్పెషల్ స్క్రీనింగ్ లో ఈ సినిమాను చూసిన దిల్ రాజు, తెలుగు రీమేక్ రైట్స్ ను కోటి రూపాయలకు దక్కించుకున్నారు. త్రిష .. విజయ్ సేతుపతి పాత్రలను తెలుగులో సమంత, శర్వానంద్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది.