బన్ని ని ఇలా  చూసి షాక్ అవుతున్నారు

అల్లు అర్జున్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఫ్యాన్ బేస్ తో సోషల్ మీడియా ఎక్కౌంట్స్ కొన్ని లక్షల లైక్ లు, షేర్స్ తో విరిసిల్లుతూ ఉంటాయి. తాజాగా వారందిరినీ ఆశ్చర్యపరిచే ఫొటోలు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆ ఫొటోల్లో అల్లు అర్జున్ ని చూసి వారంతా ఆశ్చర్యపోతున్నారు.

మరీ ముఖ్యంగా మేకప్ లేకుండా బన్ని…నలిగిన షర్ట్ లో ఓ సాధారణ మధ్య తరగతి మనిషిగా కనపడటం వారి ఊహకు అందనిది. మీరు ఇక్కడ ఆ ఫొటోలు చూడవచ్చు. ఇక ఈ ఫోటోలు బన్ని తన భార్య ..అమ్మమ్మ ఇంటికి దసరా సందర్బంగా వెళ్లినప్పుడు క్లిక్ మనిపించినవి.

అల్లు అర్జున్‌ తన కుటుంబ సమేతంగా.. తన భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ గ్రామమైన నల్గొండ జిల్లా పెద్దఊరు మండలం చింతపల్లి గ్రామంలో ప్రతి ఏడాది దసరా వేడుకల్లో పాల్గొంటున్నారు.

అదే విధంగా ఈ ఏడాది కూడా చింతపల్లి గ్రామంలో బంధుమిత్రుల మధ్య బాణసంచా కాల్చి దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తన కుమారుడు, కుమార్తె అయాన్‌, అర్హతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.