వ్వావ్.. క్యూట్ బ్రదర్ అండ్ సిస్టర్ సెలబ్రేషన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసులు అల్లు అయాన్ – అల్లు అర్హ స్వాతంత్య్ర దినోత్సవ సెలబ్రేషన్స్ చూశారా? ఈ ఫోటో చూశాక వ్వావ్ అనకుండా ఉండలేరు. ఈ చిన్నారు ఇద్దరూ హైపర్ యాక్టివ్. డాడ్ అల్లు అర్జున్ తో కలిసి ఇంట్లో ఉన్నప్పుడు బోలెడంత అల్లరల్లరి చేసేస్తుంటారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని బన్ని ఎప్పటికప్పుడు ఎంతో సంబరంగా అభిమానులకు షేర్ చేస్తుంటారు.
తాజాగా నిన్నటిరోజున స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రదర్ అండ్ సిస్టర్ అయాన్- అర్హ జెండా వందనం చేసేందుకు ముందు ఎలా ప్రిపేరయ్యారో ఫోటోల్ని రివీల్ చేశారు. అల్లు అయాన్ తెల్ల దొర వేషంలో కనిపిస్తే.. తెల్లదొరలను ఎదురించి ఆటకట్టించిన క్వీన్ ఝాన్సీ రాణి వేషధారణలో అల్లు అర్హ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోని అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. బన్ని ప్రస్తుతం `అల వైకుంఠపురంబులో` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. అభిమానుల్లో ఈ టైటిల్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.