మాస్ ని మెప్పించాలంటే రా కంటెంట్ తో రస్టిక్ సినిమాలు తీయాలి. ఇటీవల నవతరం దర్శకులు అనుసరిస్తున్న పంథా ఇదే. ప్రేమకథల్లో యాక్షన్ థ్రిల్ రొమాన్స్ ని మిక్స్ చేసి హీట్ పెంచేస్తున్నారు. శ్రీకాకుళం యాసతో తెరకెక్కించిన పలాస ఈ జోనర్ లోనే వచ్చి విజయం సాధించింది. నాటకం .. భైరవ గీత వంటి సినిమాలకు ఇదే తరహాలో రా అండ్ రస్టిక్ కంటెంట్ అస్సెట్ అనే చెప్పాలి. ఇక ఆర్.ఎక్స్ 100 చిత్రంలో పాయల్ క్యారెక్టరైజేషన్ హీరో రా క్యారెక్టరిస్టిక్ యాటిట్యూడ్ ఇవన్నీ విజయానికి సాయమయ్యాయి.
ఇక ఇటీవల ఓటీటీ వేదికపై వస్తున్న సినిమాల సరళి పరిశీలిస్తే.. రామ్ అండ్ లీలా ఈ తరహానే. కంటెంట్ లో ఘాడత పాత్రల చిత్రణలో డెప్త్ ఆకట్టుకుంది. తాజాగా `బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి` అనే సినిమా ఓటీటీల్లోకి రానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ రక్తి కట్టిస్తోంది. సమంత ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
1994లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. `ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది.. కానీ నా కథ నా చావుతో మొదలైంది` అనే డైలాగ్ తోనే స్టోరీలోకి వెళ్లారు. హీరో రఫ్ గా కనిపిస్తుంటే.. ఎంతో లవ్వబుల్ నైజాం పోరిగా హీరోయిన్ యాస భాష వేషధారణ ఆకట్టుకుంటున్నాయి. కొత్త జంట నడుమ రొమాన్స్ వేడెక్కిస్తోంది. రామ్ కె మహేషన్ సినిమాటోగ్రఫీ.. మిహిరాంశ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అస్సెట్ అనే చెప్పాలి. పోలూరి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పమిడిముక్కల చంద్రకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. మున్నా – దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించగా రవి వర్మ సుబ్బారావు పవిత్రా జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఆహా ఓటీటీ లో సినిమా విడుదలవుతోంది.