విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. తమిళ అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా మీద మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. నారప్ప గెటప్లో వెంకటేష్ లుక్ కూడ ఆకట్టుకోవడంతో సినిమా తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం క్రియేట్ అయింది. వెంకటేష్ సైతం ఎంతో డెడికేషన్ పెట్టి సినిమా చేశారు. ఇక ఫ్యాన్స్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
వయసు మళ్ళిన తండ్రి గెటప్లో వెంకటేష్ లుక్ అథేంటిక్ ఫీల్ ఇస్తోంది. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. వెంకీ ఇంత రఫ్ అండ్ రియాలిస్టిక్ లుక్లో కనిపించడం ఇదే తొలిసారి. ప్రధాన పాత్రలు, ట్రైలర్లోని వాతావరణం చూస్తే ఒరిజినల్ వెర్షన్లోని ఫ్లేవర్ అలాగే తీసుకురావడంలో శ్రీకాంత్ అడ్డాల సక్సెస్ అయ్యారనే అనిపిస్తోంది. యంగ్ లుక్ కూడ చూడదగినదిగానే ఉంది. ట్రైలర్లో కనిపిస్తున్న యాక్షన్ షాట్స్ చూస్తే ఫైట్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. పీటర్ హెయిన్స్ మార్క్ గట్టిగా కనిపిస్తోంది. డైలాగ్స్ కూడ మంచి ఎమోషనల్ గా ఉన్నాయి. ప్రధాన పాత్రలకు ప్రముఖ నటీనటులనే తీసుకున్నారు. మణిశర్మ తన నేపథ్య సంగీతంతో మరోసారి మ్యాజిక్ చేశారు. మొత్తానికి ట్రైలర్ ఆకట్టుకోవడమే కాదు సినిమా మీద నమ్మకాన్ని అంచనాలను ప్రధానంగా వెంకటేష్ పెర్ఫార్మెన్స్ మీద అమితమైన ఆసక్తిని క్రియేట్ చేసిందనే అనాలి. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం జూలై 20న విడుదలకానుంది.