సూపర్ స్టార్ మహేష్ బాబు కథ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అవతల కథ చెప్పే దర్శకుడు ఎవరైనా సరే ఆ కథ తనకు నచ్చితేనే ముందుకెళ్తారు. హిట్టవుతుందా లేదా అనేది ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేస్తారు. అదే కథ నచ్చలేదు అంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తారు. మహేష్ బబులోని ఈ ముక్కుసూటి తనమే ఆయనకు కొందరు దర్శకులను దూరం చేసిందని అన్నాలి. మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ ఇచ్చిన కాంబో వారిది. అలాంటి ఆ ఇద్దరికీ ఇప్పుడు సరిగ్గా పడట్లేదనేది టాక్. కారణం పూరి చెప్పిన ‘జనగణమణ’ స్క్రిప్ట్ మహేష్ బాబుకి పెద్దగా నచ్చలేదు.
పూరి వైపు నుండి స్క్రిప్ట్ బాగానే ఉన్నా మహేష్ ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇక సుకుమార్ చెప్పిన కథ నచ్చక వేరే సినిమాలు చూసుకున్నాడు. అలా ఇద్దరు స్టార్ డైరెక్టర్లను కథ విషయంలో వ్యతిరేకించారు మహేష్. ఇప్పుడు ఇంకొక స్టార్ డైరెక్టర్ విషయంలోనూ అలాగే జరుగుతోందట. అనిల్ రావిపూడి మహేష్ బాబుకు కథ చెప్పారట. కానీ అది ఆయనకు పెద్దగా నచ్చలేదని, ముఖ్యంగా సెకండ్ హాఫ్ సరిగా లేదని అభిప్రాయపడిన మహేష్ ఆ కథకు నో చెప్పారట. అనిల్ రావిపూడి గతంలో మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి హిట్ సినిమా తీశారు. అయినా కూడ మహేష్ కథ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మార్చి తీసుకురమ్మని చెప్పారట.