చిరు-చ‌ర‌ణ్ న‌డుమ‌ ఆలియా ఫిట్టింగ్

RRR బ్యూటీతో మెగాస్టార్ కి చిక్కులు?

RRR బ్యూటీ ఆలియా భ‌ట్ మెగాస్టార్ కి చిక్కులు తేనుందా?. చిరు- చ‌ర‌ణ్ మ‌ధ్య ఊహించ‌ని ఫిట్టింగ్ పెడుతోందా? అంటే అవున‌నే స‌మాచారం. ఓవైపు రాజ‌మౌళి శ‌ర‌వేంగా ఆర్.ఆర్.ఆర్ లో ఆలియా పార్ట్ ని చిత్రీకరించాల‌ని ప్లాన్ చేస్తుంటే అందుకు ఈ బ్యూటీ నుంచి స‌హ‌కారం ఉండేట్టు లేద‌ని చెబుతున్నారు. అయితే అందుకు కార‌ణం లేక‌పోలేదు.

ఓవైపు కొవిడ్ 19 ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా అటు ముంబైని గ‌జ‌గ‌జ ఒణికిస్తోంది. మ‌హ‌మ్మారీ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇక సెట్స్ కి వెళ్లేందుకు ప్ర‌భుత్వాలు అనుమ‌తించినా కానీ .. అంత‌మందితో కలిసి ప‌ని చేయ‌డం అంటే రిస్కేన‌ని హీరోలు హీరోయిన్లు బెంబేలెత్తుతున్నారు. దీంతో షూటింగుల‌కు రాలేమ‌ని మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్నారు. సేమ్ టు సేమ్ ఆలియా కూడా సందేహిస్తోంద‌ట‌. సెట్స్ కెళితే ఎట్నుంచి ఏ ప్ర‌మాదం చుట్టుకుంటుందోన‌న్న ఆందోళ‌న‌లో ఆలియా ఉంద‌ట‌. దీంతో ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌కు వ‌స్తుందా రాదా? అన్న సందిగ్ధ‌త నెల‌కొంద‌ట‌. ఇప్ప‌టికే రాజ‌మౌళి సంప్ర‌దిస్తే రాలేన‌ని చెప్పేసిందిట‌.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే అది రాజ‌మౌళికే కాదు ఇటు చిరంజీవి-చ‌ర‌ణ్ ల ఆచార్య‌కు ఇబ్బందిక‌ర‌మే. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి చ‌ర‌ణ్ – ఆలియా మ‌ద్య పెండింగ్ షూట్ పూర్త‌యితేనే త‌దుప‌రి చ‌ర‌ణ్ ఆచార్య సెట్స్ కి వెళ్ల‌డం కుదురుతుంది. అది వేగంగా ముగించాల‌ని జ‌క్క‌న్న‌ను షంటేస్తున్నాడు చ‌ర‌ణ్‌. కానీ ఆలియా ఫిట్టింగ్ ఇప్పుడు చెర్రీకి ఇబ్బందిక‌రంగా మారింది. ఇది చిరంజీవి .. చ‌ర‌ణ్ మ‌ధ్య ఫిట్టింగ్ పెట్ట‌డ‌మేన‌ని అభిమానులు మాట్లాడుకుంటున్నారు మ‌రి.