సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. వీటిలో బన్ని- మహేష్ చిత్రాలు క్రేజీగా ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుని వస్తున్నాయి. బన్ని నటించిన అల వైకుంఠపురములో ప్రీరిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే… నైజాం – 20.00 కోట్లు.. సీడెడ్ – 12.06 కోట్లు.. నెల్లూరు – 2.80 కోట్లు.. కృష్ణా – 5.00 కోట్లు.. గుంటూరు – 6.30 కోట్లు.. వైజాగ్ – 8.50 కోట్లు.. ఈస్ట్ – 6.30 కోట్లు..వెస్ట్ – 5.00 కోట్లు.. ప్రీబిజినెస్ జరిగింది. టోటల్ ఏపీ+తెలంగాణ – 65.96 కోట్ల మేర బిజినెస్ చేశారు. కర్ణాటక – 7.20 కోట్లు.. రెస్టాఫ్ ఇండియా – 1.50 కోట్లు.. ఓవర్సీస్ – 9.80 కోట్లు.. టోటల్ వరల్డ్‌వైడ్ – 84.46 కోట్ల మేర బిజినెస్ సాగింది.
అలాగే బన్నికి ఉన్న స్టార్ డమ్ దృష్ట్యా ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో 50కోట్లు పైగా బిజినెస్ సాగిందని తెలుస్తోంది. జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత హ్యాట్రిక్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుంది అన్నది చూడాలి. దాదాపు 85 కోట్ల మేర థియేట్రికల్ షేర్ తప్పనిసరిగా తేవాల్సి ఉందని ఓ అంచనా. బన్ని సరసన పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటించగా టబు- సుశాంత్- నవదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.