సంక్రాంతి బెట్టింగ్ లో రెండు పెద్ద సినిమాలు నువ్వా నేనా? అంటూ బాక్సాఫీస్ వార్ సాగిస్తున్నాయి. `అల వైకుంఠపురములో` చిత్రానికి అన్ని వైపులా పాజిటివ్ రెస్సాన్స్ రావడం.. ప్రీమియర్ల పరంగా మెరుగైన ఫలితం అందుకోవడమే గాక.. తెలుగు రాష్ట్రాల్లో రిపోర్ట్ కూడా తాజాగా అందింది. ఎట్టకేలకు బన్ని వెయిటింగ్ ఫలించిందని ఈ ఓపెనింగుల రిపోర్ట్ చెబుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. అల వైకుంఠపురములో ఏపీ-తెలంగాణ లో 25కోట్ల మేర షేర్ వసూళ్లను సాధించగా వరల్డ్ వైడ్ మరో 10 కోట్ల మేర షేర్ వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. నైజాం- 5.99 Cr, సీడెడ్- 4.02 Cr , ఉత్తరాంధ్ర – 2.87 Cr , ఈస్ట్- 2.98 Cr , వెస్ట్- 2.41 Cr , కృష్ణ- 1.55 Cr , గుంటూరు- 3.41 Cr , నెల్లూరు – 1.29 Cr వసూలవ్వగా ఓవరాల్ గా 24.52 కోట్లు వసూలైంది. అయితే బన్ని టీమ్ ఒక్కరోజుకే 85 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిందని పోస్టర్ ని వేయడం ఆసక్తికరం. ఇక పాతిక కోట్ల షేర్ రేంజు అంటే డబుల్ గ్రాస్ అనుకున్నా 60 కోట్ల వరకూ వీలుంటుంది. మరో పాతిక అదనంగా పెంచి వేశారా? అన్నది చిత్రబృందం చెప్పాలి.