పుట్టుకతోనే కిడ్స్ తారుమారు అవ్వడం అటుపై ఆ ఇద్దరు పెరిగి పెద్దయ్యాక ఆస్తులు అంతస్తుల పరంగా ప్రెస్టేజ్ పరంగా సమస్యలు రావడం ఆ కుటుంబాల్లో త్యాగాలు వగైరా వగైరా కథలతో ఎన్నో సినిమాలొచ్చాయి. ఒక రకంగా ఇది సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇంటి గుట్టు లైన్ అని చెబుతున్నారు. అయితే త్రివిక్రమ్ వెర్షన్ మాత్రం వేరొకలా ఉంది. నా సినిమాలన్నిటికీ మహాభారతం- రామాయణం స్ఫూర్తి అంటూ త్రివిక్రమ్ తెలివైన ఆన్సర్ ఇస్తున్నాడు. అంతేకాదు ఇది ఫ్రెష్ కథతో తెరకెక్కిన సినిమా అని తెలిపాడు.
దీంతో అసలు ఇది కాపీ కథ కానేకాదా? త్రివిక్రమ్ చెబుతున్నది నిజమేనా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమా లో బన్ని, సుశాంత్ బ్రదర్స్ అయితే.. బన్ని- పూజా , సుశాంత్ – నివేధ జంటలుగా అలరించనున్నారు. బ్రదర్స్ మధ్య కన్ఫ్యూజన్ గ్యాంబ్లింగ్ తెరపై ఆద్యంతం మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నారు. కర్ణుడి లాంటి బన్ని మంచితనం వల్లనే పేదవాడైన సుశాంత్ ధనికుడవుతాడా? అసలు టబు- జయరామ్ కి వీళ్లంతా ఏమవుతారు? అసలు వైకుంఠపురములో ఉత్కంఠ రేకెత్తించే సస్పెన్స్ ఎలిమెంట్ ఏమిటి? అన్నది ఆసక్తికరం. నేటితో ఎడతెరిపి లేని ప్రచారానికి చెక్ పడినట్టే. ఈ మిడ్ నైట్ కి ఓవర్సీస్ నుంచి తొలి రిపోర్ట్ అందనుంది. రేపటి (జనవరి 12) ఉదయానికి అల.. రేంజ్ ఎంతో తేలిపోతుంది. మధ్యాహ్నానికి రివ్యూల పరంగా క్లారిటీ వచ్చేయనుంది.