మాతో జాగ్రత్త ఉండమంటూ హెచ్చరిక, ఇంతకీ నువ్వు ఎవరివయ్యా?

                                                                 (సూర్యం)

కుక్కలతో జాగ్రత్త అనే బోర్డ్ పెట్టడం చాలా ఇళ్ల దగ్గర మనం చూస్తూంటాం. కానీ ఇప్పుడు అక్షయ్ కుమార్  ‘మనుషులతో జాగ్రత్త’ అంటున్నాడు.  అదేంటి ఆయన మనిషే కదా..ఇలా మనుష్యులతో జాగ్రత్త అని అందరినీ హెచ్చరించటం ఏమిటీ అంటారా..అదీ రోబో 2 అదే ‘2.ఓ’లో తన పాత్ర ..పాత్రోచితం అన్నమాట ..క్యారక్టరైజేషన్. అక్కడితో అక్షయ్ ఆగకుండా… ‘ఈ ప్రపంచం మనుషులు ఒక్కళ్లదే కాదు..’  అని కూడా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మరోసారి తాను మనిషి కాదు అని హింట్ ఇస్తున్నాడు. 

 

 మరి ఆయన మనిషి కాకపోతే ఆ సినిమాలో ఆయన చేసే పాత్ర ఏమిటంటారా…అదే సస్పెన్స్. ఇప్పటికే ఆయన పాత్ర గెటప్ విడుదల చేసారు. అందులో ఆయన కాకిని పోలి ఉన్నారు. అయినా అర్దాంతరంగా ఇప్పుడీ టాపిక్ ఏమిటి అంటే…ఆదివారం అక్షయ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘2.ఓ’లో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు అక్షయ్‌.