‘2.0’ టీజర్ పై ఫ్యాన్స్ కోపతాపాలు

(సూర్యం)

 

ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రజనీ హీరోగా నటించిన చిత్రం ‘2.ఓ’. అమీ జాక్సన్‌  హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన వాళ్లంతా అద్బుతం…విజువల్ మిరాకిల్ అంటూ మెచ్చుకుంటూంటే అక్షయ్ అభిమానులు మాత్రం మిరాకిల్ కాదు అది మాలాంటి ఫ్యాన్స్ ని కిల్ చేసింది అంటూ మండిపడుతున్నారు. 

 

అక్షయ్ అభిమానులు ఎదురు చూసిన స్దాయిలో ఈ టీజర్ లేదని చెప్తున్నారు. అసలు అక్షయ్ ఎక్కడ కనిపించాడు. ఏదో కొన్ని సెకండ్లు అంతేగా అని పెదవి విరుస్తున్నారు. నార్త్ ఇండియాలో చూస్తారని తెలిసినా ఎందుకు అక్షయ్ ని అండర్ ప్లేగా ఉంచేసారు అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక వీరాభిమాని అయితే…అక్షయ్ కాకిలా కనపడటమేంటి..అంటూ ఫైర్ అయ్యాడు. 

 

అసలు తెల్లగా ఉండే అక్షయ్ ని కాకిలా చూపించడం ఒక అభిమానికి నచ్చలేదు. “సాలా అక్షయ్ కొ కాలా కౌవా బనాయా?” అంటూ ఫైర్ అయ్యాడు..మరి అభిమానుల అభిమానం అలానే ఉంటుంది.  సరిగ్గా ఒక్క సెకన్ కూడా అక్షయ్ కుమార్ రిజిస్టర్ కాలేదు. మీకు మా హిందీ మార్కెట్ అక్కర్లేదా..అంటూ ఫైటింగ్ కు వస్తున్నారు. 

 

వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్లు అనేది నిజమే…తమ హీరో టీజర్ వస్తోందంటే కళ్లు ఒత్తులు చేసుకుని ఎదురుచూస్తారు. అయితే ఇలా నిరాశపరుస్తారను కోరు కదా. కానీ వాళ్లు కూడా ఓ విషయం గుర్తించుకోవాలి. ఈ సినిమాలో రజనీ హీరో. అక్షయ్ యాంటి హీరో మాత్రమే. ఎవరికి ఎంత ప్రయారిటి ఇవ్వాలో అంతే ఇస్తారు. అయినా నిన్న రిలీజ్ చేసింది కాన్సెప్టు టీజర్.