టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో కనిపించేది చాలా తక్కువ. చాలా ఇంపార్టెంట్ అయితే గాని ఆయన ట్విట్టర్ ను ఉపయోగించరు. ఎక్కువగా వివాదాల్లోకి వెళ్ళకుండా చాలా కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా మన్మథుడు పాజిటీవ్ గానే హైప్ క్రియేట్ చేసుకుంటాడు. ఇక ఇటీవల ఏమైందో ఏమో గాని ఒక్క ట్వీట్ తో యాపిల్ కంపెనీ పరువు తీసేశాడు నాగార్జున.
బ్రాండెడ్ మొబైల్ ఫోన్ అంటే యాపిల్ కంపెనీ ఫోన్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ బ్రాండ్ మొదలయినప్పటి నుంచి కూడా సెక్యూరిటి విషయంలో కస్టమర్లలో ఒక బలమైన నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంది. రేటు లక్ష దాటినా కూడా అమ్మకాలు మాత్రం ఆగలేదు. అయితే సర్వీస్ విషయంలో మాత్రం జాగ్రత్త అంటూ నాగార్జున ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో యాపిల్ కంపెనీ స్టోర్లు నుంచి ఆ బ్రాండ్ ఫోన్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ.. సర్వీస్ అనేది చాలా భయంకరంగా ఉంటాయి. అంతే కాకుండా ఏకపక్షంగా కూడా ఉంటాయని నాగ్ సదరు కంపెనీ ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ కూడా చేశారు.
దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. వందల కోట్ల ఆదాయం ఉన్న నాగార్జున లక్ష విలువ చేసే ఫోన్ సర్వీస్ గురించి ఆవేదన చెందడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా యాపిల్ ఫోన్ తోనే ట్వీట్ చేసి మరీ ఆ సంస్థకు కౌంటర్ ఇవ్వడం నిజంగా స్పెషల్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్య కాలంలో యాపిల్ కంపెనీ సర్వీస్ పై కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి నాగార్జున లాంటి సెలబ్రెటీ ట్వీట్ చేయడం పట్ల ఆ సంస్థ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.