అందం గురించి నాగార్జున స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ!

నాగార్జున ఈ నెల 27న `దేవ‌దాస్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందం గురించి అందులో ఆయ‌న ఏమ‌న్నారంటే…

 

* మీ అందం సీక్రెట్ ఏంటండీ…

– అలా ఏమీ లేదండీ. 30 ఏళ్ల క్రితం ఏం చేశానో ఇప్పుడూ అదే చేస్తున్నా..

 

* ఇప్పుడు మీకు 59 క‌దా…

– అయ్యో మాన‌సికంగా నేను 25 ద‌గ్గ‌రే ఆగిపోయా. నాకున్న‌ది కొడుకులు కాదు. త‌మ్ముళ్లు. వాళ్ల‌ని నేను కొడుకులుగా అనుకోను.

 

* మీ ఆవిడ మీ అందం గురించి ఏమైనా అంటుంటారా?

– అమ‌ల ఎందుక‌నదు.. మీరు 25 ఏళ్ల కుర్రాడ‌నుకుంటున్నారా? అని అడుగుతుంది. `అవును` అనే స‌మాధానం చెబుతా. అలా అన‌క‌పోతే, అవ‌క‌పోతే నేను చైతూని, అఖిల్‌ని వాళ్ల స్థాయిలోకి వెళ్లి ఎలా డీల్ చేయ‌గ‌ల‌ను.

 

* మీలో ఎవ‌రు ఎవ‌రికి స‌ల‌హాలిస్తుంటారు?

– నాక‌న్నా చైత‌న్య పెద్ద‌వాడిలాగా ఆలోచిస్తాడు. న‌న్ను కూర్చోబెట్టి స‌ల‌హాలు ఇచ్చేస్తుంటాడు.

 

* మీ ఫ్రెండ్స్ ఏమంటారు?

– ఈ మ‌ధ్య ఓ ఫ్రెండ్ న‌న్ను కూర్చోబెట్టి… నాతో క‌లిసి పెరిగిన వ్య‌క్తే అనుకోండి.. సీరియ‌స్‌గా ఓ స‌ల‌హా ఇచ్చాడు. `ద‌య‌చేసి నువ్వు.. నీ క‌న్నా 20ఏళ్లు చిన్న‌వాళ్ల‌తో ఫ్రెండ్‌షిప్  చెయ్యి. లేకుంటే చాలా క‌ష్టం. రేపు మేం లేక‌పోతే నువ్వు చాలా క‌ష్ట‌ప‌డ‌తావ్` అని అన్నాడు. అదేంటో.. నాకు న‌వ్వు తెప్పించింది.

 

* ఇంత‌కీ అందం సీక్రెట్ చెప్ప‌లేదు..

– మాన‌సికంగా ఫీల‌యితే వ‌య‌సు క‌నిపిస్తుంది. అలాగ‌ని నా వ‌య‌సు గురించి నాకు అవ‌గాహ‌న లేక‌కాదు. ఏం తిన్నా ఆరోగ్యంగా తింటా. ఎక్స‌ర్‌సైజ్ త‌ప్ప‌కుండా చేస్తా. అంతే. అంత‌కు మించి ఇంకేమీ లేదు. మ‌న‌సులో మాత్రం ఏదీ ఉంచుకోను. ఎక్స్ ట్రా ల‌గేజ్ మోయ‌డం నాకు ఇష్టం ఉండ‌దు.