అఖిల్,హలో,మిస్టర్ మజ్ను` చిత్రాల తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న నాలుగో సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం(జూలై 15న) హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ 2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, వాసువర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కాస్త డిలే అయ్యింది. హైదరాబాద్ కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో అఖిల్‌పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా ఇందులో హీరోయిన్ ఒకే కాలేదు .
అఖిల్ సినిమా షూట్ స్టార్ట్
