ఏంటి…అజిత్  …ఆ సినిమా కమిటయ్యాడా..అంతా షాక్

హీరోలపై అభిమానులకు అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ హీరోలు, స్టార్ హీరోలు అంటే కొన్ని లెక్కలతో సినిమాలు చేస్తూంటారు. కానీ తమిళ స్టార్ హీరో, అల్టిమేట్ స్టార్ అజిత్ మాత్రం ఆ లెక్కలకు అతీతుడులా ఉన్నాడు. ఆయన తాజాగా ఓకే చేసిన సినిమా ఇప్పుడు అందరికీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు..హిందీలో సూపర్ హిట్టైన పింక్ సినిమా రీమేక్. ఆ సినిమాలో అమితాబ్ చేసిన పాత్రలో అజిత్
కనిపించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే వయస్సు మళ్లిన లాయిర్ పాత్రలో అజిత్ కనిపించటాన్ని మాత్రం అంతా ఆశ్చర్యపరిచే అంశం అంటున్నారు. అయితే తమిళ వెర్షన్ లో వయస్సు మళ్లినట్లే ఎందుకు చూపిస్తారు …అజిత్ ఎలా ఉన్నారో అలాగే తెరపై కనిపిస్తారు…ఆయన ముసలి గెటప్ వేయాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు. ఏదైమైనా ఈ సినిమా ద్వారా అజిత్ …మహిళాభిమానులను పొందుతారనటంలో మాత్రం సందేహం లేదు.

ఈ రీమేక్ చిత్రాకి చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ద్వారా  మళయాళ నటి నజ్రియా తమిళంకు ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈమె హిందీలో  నటి తాప్సీ పాత్రను పోషించనుందా, వేరే పాత్రా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా నజ్రియా రీఎంట్రీ మాత్రం ఈ సినిమాతోనే  అని తెలిసింది.

 
ఇక అజిత్‌ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సంక్రాంతికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో అజిత్‌ కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు.