భార్యని అడ్డం పెట్టి  హీరో ప్రాక్టికల్ జోక్..కట్ చేస్తే సీన్ రివర్స్

                                   (సూర్యం)

కొన్ని ప్రాక్టికల్ జోక్స్  ఆలోచనగా బాగుంటాయి. కానీ అవి అమల్లోకి వచ్చేసరికి రివర్స్ అవుతాయి..నవ్వులు పాలు అవుతాయి. ఇప్పుడు అదే పరిస్దితి బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ ది. ఆయన తన భార్య కొత్త చిత్రం ప్రమోషన్ కోసం ఉపయోగపడుతుందని ఆలోచించించి..చించి.. ఓ ప్రాక్టికల్ జోక్ ప్లే చేసాడు.

అదేమిటంటే.. స్వయంగా తన భార్య కాజోల్ ఫోన్ నెంబర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ లో కలకలం సృష్టించాలనుకున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో కాజోల్ ఫోన్ నెంబర్ ను షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు నికి గురయ్యారు.

“కాజోల్ ప్ర‌స్తుతం ఇండియాలో లేదు. ఇది ఆమె వాట్సాప్ నెంబ‌ర్. ఈ నెంబ‌ర్ ద్వారా ఆమెను సంప్ర‌దించ‌గ‌ల‌రు” అంటూ ట్వీట్ చేశాడు అజయ్ దేవగణ్. అయితే ఇది చూసిన ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు ముందుగా షాక్ తిన్నారు. ఆ తరువాత తేరుకొని తమ అభిమాన హీరోయిన్ కాజోల్ నెంబర్ కు మెసేజ్ లు పంపటం మొదలెట్టారు. పంపడమేకాదు… రిప్లై కోసం ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో అజయ్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు.

సినిమాల్లో ప్రాంక్స్ చేసీచేసీ తన కు బోర్ కొట్టిందనీ…. అందుకే ఈసారి ఇలా ప్రాంక్ చేశానని అన్నాడు. ఈ మేరకు అజ‌య్ మ‌రో ట్వీట్ చేశాడు. ఇంకేముంది తమ అభిమాన హీరోయిన్ నెంబర్ దొరికిందన్న సంతోషం అభిమానులకు కాసేపు కూడా నిలవకపోవటంతో జనం అజయ్ ని తిట్టిపోవటం మొదలెట్టారు. కొంతమందైంతే ఓ రేంజిలో క్లాస్ లు పీకారు. సారీ చెప్పమని డిమాండ్ చేసారు. మాతో ఆడుకుంటావా అని
కోప్పడ్డారు. ఈ రియాక్షన్ చూసి అజయ్ షాక్ అయ్యింటాడు అని వేరే చెప్పాలా. సీన్ రివర్స్ అవ్వటం అంటే ఇదే మరి.