‘శ్రీనివాస కళ్యాణం’..నుంచి కోలుకునేందుకు పూర్తి రివర్స్  స్కెచ్

దిల్ రాజు నిర్మాతగా, వేగెశ్న సతీష్ దర్శకుడుగా ఎన్నో అంచనాలతో వచ్చిన చిత్రం శ్రీనివాస కళ్యాణం. అయితే ఊహించని విధంగా  డిజాస్టర్ కావటంతో నిరాశపడిన నితిన్ కు ..’RX100′ హిట్ ఓ దిక్సూచిలా కనిపించింది. తను సంప్రదాయం …తెలుగుతనం అని వెళ్లి బోల్తా పడ్డాను అని ..అందుకు రివర్స్ రూట్ లో అజయ్ భూపతి వెళ్లి హిట్ కొట్టాడని తెలుసుకుని వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసాడు.

చేసింది ఒక్క సినిమా ..కానీ పది హిట్ సినిమాలకు చేసినంత పేరు వచ్చింది. ఆ దర్శకుడే అజయ్ భూపతి. కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్ లతో ..సరి కొత్త కాన్సెప్టు తో పెద్ద హిట్ కొట్టిన అజయ్ భూపతి తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటారు. వాస్తవానికి ఆయన తన నెక్ట్స్ సినిమాని ఓ మల్టిస్టారర్ ప్లాన్ చేసారు. రామ్,దుల్కర్ సల్మాన్ హీరో అన్నారు కానీ అది ప్రపోజల్ స్దాయిలోనే ఆగినట్లు సమాచారం. దాంతో తన తదుపరి చిత్రానికి నితిన్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టుని  భవ్య క్రియేషన్స్ వారు నిర్మిస్తారు. ఇప్పటికే నితిన్ ..అజయ్ చెప్పిన కథను ఓకే చేసి..స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటన రానుంది. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలతో ప్రకటన రానుంది.