వివాదాస్పద ఘటనలు ఎలా చూసుకున్నా మన తెలుగు ఇండస్ట్రీ లో అయితే చాలా తక్కువే ఉంటాయని చెప్పాలి. కానీ వచ్చేది ఏదో ఒక్కటి అయినా కూడా అది పెద్ద స్థాయిలోనే ఉంటుంది. మరి లేటెస్ట్ గా అయితే ఏమైందో తెలీదు కానీ ఓ యంగ్ హీరో సినిమాని మాత్రం తొక్కాలని పలువురు పెద్దలు చూస్తున్నట్టుగా అందరికీ బాగా అర్ధం అయ్యిపోయింది.
రీసెంట్ గానే ఈ షాకింగ్ అంశం పై కూడా చర్చించుకున్నారు. మరి ఆ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ కాగా ఆ సినిమానే “కార్తికేయ 2”. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా మా సినిమాని వాయిదా వేసుకోమని కొందరు పెద్దలు తనని ఇబ్బంది పెట్టారని నిఖిల్ ఆవేదనకు లోనయ్యాడు.
సరే మళ్ళీ కొత్త డేట్ తెచ్చుకుంటే దీనికి కూడా మీకు మళ్ళీ థియేటర్స్ దొరకవు అక్టోబర్ లో గాని నవంబర్ లో గాని రిలీజ్ చేసుకోవాలని అంటున్నారని అసలు విషయం కూడా చెప్పేసాడు. అయినా కూడా ఈ ఆగస్ట్ రెండో వారం రిలీజ్ కే ఫిక్స్ అయ్యి ఉండగా లాస్ట్ మళ్ళీ ఈ సినిమాని వాయిదా పడేలా చేస్తున్నట్టుగా షాకింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.
మళ్ళీ వాయిదా ఆల్ మోస్ట్ ఖరారు అయ్యిందని దీనిపై అధికారిక ప్రకటన కూడా రావచ్చని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఓ మంచి అంచనాలు ఉన్న సినిమాని ఇంతలా ఇబ్బంది పెట్టడం సరైన పని కాదనే చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.