వెంకి కు మళ్లీ అదే సమస్య..పరిష్కారం మళ్లీ ఆమే

సీనియర్ హీరోలకు వచ్చే పెద్ద సమస్య…హీరోయిన్స్ కొరత. అది గత కొంతకాలంగా వెంకటేష్ ని వెంటాడుతోంది. దాంతో ఆయన తో సినిమా అనుకోగానే హీరోయిన్ ఎవరూ అనేదే పెద్ద క్వచ్చిన్ గా మారుతోంది. అయితే వెంకటేష్ పెద్ద మనస్సు చేసుకుని తనతో గతంలో చేసిన హీరోయిన్స్ నయనతార, శ్రియ, త్రిష వంటివారితో సర్దుకుపోతున్నారు.

పోనీ ధైర్యం చేసి కొత్తవాళ్లను పెట్టుకుందామంటే వాళ్లు చిన్నపిల్లల్లా కనపడుతున్నారు. అలాగని ఇతర భాషల్లో సీనియర్స్ ని అడుగుదామంటే వాళ్లు రెమ్యునేషన్ అందుబాటులో ఉండటం లేదు. వయస్సు తో పాటు మార్కెట్ పెరగదు కదా. దాంతో తన మార్కెట్ కు తగిన హీరోయిన్ నే ఎంచుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే మళ్లీ వెంకటేష్ తనకు పర్మనెంట్ హీరోయిన్ గా మారిన శ్రియనే ఎంచుకున్నారు.

శ్రియ,వెంకటేష్ కాంబినేషన్ లో సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల చిత్రాలు గతంలో వచ్చాయి. ఇప్పుడు మరోసారి బాబి డైరక్షన్ లో రూపొందనున్న వెంకీ మామ సినిమా కోసం ఆమెనే సీన్ లోకి తెచ్చినట్లు సమాచారం. ఓ ప్రక్కన తన మేనల్లుడు నాగచైచతన్య రకుల్ ప్రీతి సింగ్ తో రెచ్చిపోతూంటే తను శ్రియతో సరదాలు చేయాల్సిన సిట్యువేషన్. తప్పదు కదా హీరో స్టేజ్ నుంచి సీనియర్ హీరో స్టేజికు రావటం అంటే ప్రమోషన్ కాదు…డిమోషన్.

వెంకటేష్‌, నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వెంకి మామ’ చలన చిత్రాన్ని ఈ నెల 17న ప్రారంభించనున్నట్లు సినీ దర్శకుడు బాబీ అన్నారు. బాబీ మాట్లాడుతూ ‘వెంకి మామ’ చలనచిత్రాన్ని అందరూ ఆకట్టుకునే రీతిలో నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింతగా ఆదరిస్తారన్న నమ్మకముందన్నారు.