అదాశర్మ..’సెక్స్ మార్పిడి సర్జరీ’ ,ఎక్సైటింగ్ గా ఉందిట

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్‌గా చేసింది అదా శర్మ. ఆ సినిమా తర్వాత ఆమెకు వరస ఆఫర్స్ వచ్చేస్తాయి. లైఫ్ మారిపోతుందని అంతా బావించారు. అయితే అది తప్పే అని అతి కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. ఆ తర్వాత అడపాదడపా..కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించినా కలిసొచ్చిందేమీ లేదు. దానికి తోడు అదాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి. ఈ నేపధ్యంలో ఆమె ఓ సెక్స్ కామెడీ లో నటించటానికి ఓకే చేసింది.

త్వరలో అదాశర్మ తెరపై సెక్స్ మార్పిడి సర్జరీ చేసుకున్న మగాడి పాత్రలో కనిపించబోతున్నారు. ట్రాన్స్ జెండర్ సబ్జెక్ట్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉండబోతోంది. ‘మ్యాన్ టు మ్యాన్’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రంలో అదా శర్మ ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించబోతోందని బాలీవుడ్ సమాచారం.. అబిర్ సేన్‌గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, అదే సమయంలో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు.

‘మ్యాన్ టు మ్యాన్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లింగమార్పిడి చేసుకున్న మగాడి పాత్రలో అదా శర్మ కనిపించబోతోంది. పుట్టకతో పురుషుడైన ఆమె లింగమార్పిడి చేసుకుని స్త్రీగా మారుతుంది. నవీన్ కస్తూరియా అదా శర్మ భర్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఆదా శర్మ అందం చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్న నవీన్ కస్తూరియా… ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంటాడు. స్త్రీగా మారిన ఒక మగాడిని పెళ్లాడిన అతడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది కామెడీగా చూపించబోతున్నట్లు బాలీవుడ్ భోగట్టా.