వామ్మో.. `RX 100` టైటిల్ ని,హీరోయిన్ ని కలిపి వాడేస్తున్నారు

ఒక సినిమా రిలీజై హిట్ అయ్యిందంటే ఆ సినిమాలో నటించే హీరో,హీరోయిన్, డైరక్టర్ అంతా బిజి అయ్యిపోతారు. వారిన తమ సినిమాలోకి తీసుకోవటం లక్కీ సెంటిమెంట్ గా చాలా మంది భావిస్తారు. అయితే మరికొందరు ఆ సినిమా టైటిల్ ని అనుకరిస్తూ…అందులో హీరోయిన్ ని రిపీట్ చేయటం ద్వారా హిట్ కొట్టాలనుకుంటారు.ఇప్పుడదే జరుగుతోంది.

గ‌త ఏడాది `RX 100` అనే సూప‌ర్ హిట్‌ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. అందులో హాట్ అందాల‌తో కుర్ర‌కారుని క‌వ్విస్తూ, తన .. పెర్ఫామెన్స్‌తో కూడా దుమ్ము రేపింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఇప్పుడు ఆమెను ప్రధాన పాత్రలో పెట్టి, అదే టైటిల్ కు దగ్గరుండేలా టైటిల్ ని సినిమాకు పెడితే బిజినెస్ అవుతుందనే ఆలోచన ఓ తెలుగు దర్శకుడు వచ్చినట్లుంది. వెంటనే అమలు పరిచేసాడు.

దాంతో `RDX ల‌వ్‌` అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మొదలైంది. భాను శంక‌ర్ ద‌ర్శ‌కుడు. సి.క‌ల్యాణ్ నిర్మాత‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. టైటిల్ ఒకేలా ఉండటంతో.. `RX 100`కు సీక్వెల్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమన్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న సినిమాపై వ‌స్తున్న రూమ‌ర్స్‌ను న‌మ్మొద్దంటూ పాయ‌ల్ క్లారిటీ ఇచ్చింది. `RX 100`కు `RDX ల‌వ్‌`సీక్వెల్ కాద‌ని.. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీ అని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా తెలియ‌జేసింది.