గతంలో బోయ్ ఫ్రెండ్ ఆత్మహత్య తో వార్తల్లోకి ఎక్కిన తమిళ టీవీ నటి నీలాని మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ మంజునాథ్ తన ఇంటిమేట్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. తన కొత్త బోయ్ ఫ్రెండ్ నుంచి తనకు, పిల్లలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని, అతడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరింది.
తమిళంలో సీరియల్ నటిగా పాపులర్ అయిన నీలాని… ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య తమిళనాడులో జల్లికట్టు ఆందోళన సందర్భంగా పోలీస్ డ్రెస్సులో వీడియో రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేసింది. అప్పుడు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇదిగో ఇప్పుడేమో ఇలా బోయ్ ఫ్రెండ్ నుంచి రక్షణ కల్పించాలంటోంది.
9 నెలల క్రితం విదేశాల్లో పని చేస్తున్న మంజునాథ్ పరిచయం అయ్యాడని, తనతో పాటు ఇద్దరు పిల్లలను బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడని తెలిపింది. అయితే కొన్ని రోజుల తర్వాత మంజునాథ్ అసలు స్వరూపం తెలిసిందని, అతడికి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని తెలిసి దూరంగా ఉంటున్నట్లు నీలాని తెలిపారు.
నీలాని వరస వివాదాలు తెలిసిన పోలీస్ లు ఏది నిజమో…ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్దితి లో పడుతున్నారు. నీలాని మాటలు నమ్మాలో అక్కర్లేదో తెలియక,, ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. అంతకు ముందు ఆమె బోయ్ ఫ్రెండ్ లలిత కుమార్ సైతం తనను వేధించేవాడని అప్పట్లో కంప్లైంట్ చేసిన సంగతి విదితమే.