కోలీవుడ్ డైరెక్టర్ .. నటుడు ఎస్.జె.సూర్య గురించి పరిచయం అవసరం లేదు. స్పైడర్ సినిమాతో తెలుగు నాటా పాపులరయ్యాడు. నటుడిగానూ ప్రతిభావంతుడిగా నిరూపించుకున్న సూర్య వరుసగా ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదంతా ఒకెత్తు అనుకుంటే.. ఎస్. జె సూర్య ఓ నటిని ప్రేమిస్తున్నానంటూ.. వేధిస్తున్నాడని కోలీవుడ్ మీడియాలో కథనాలు రావడం సంచలనమైంది. నటి ప్రియాభవానీని శంకర్ ప్రేమించినట్లు..ఆ ప్రేమను ప్రియాభవాని తీరస్కరించారని ప్రచారమవుతోంది.
అయితే తనపై అలా రాసిన వాళ్లంతా ఫూల్స్ అంటూ సూర్య ఫైర్ అయ్యారు. కొందరు ఫూల్స్ పనిగట్టుకుని తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రియాభవానీకి ఐలవ్ యూ చెప్పినట్లు… దాన్ని ఆమె తిరస్కరించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. అసలు మా గురించి ఆ ఫూల్స్ కి ఏం తెలుసు. అందుకే ఈ వివరణ ఇస్తున్నా. మాన్ స్టర్ చిత్రంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహాన్ని కొందరు తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి విష ప్రచారానికి పూనుకున్నారు. తెలిసో ..తెలియకో అలా చేసారు. ఇకపై వాటిని ఆపండి అంటూ సీరియస్ అయ్యాడు. ఇక ప్రియా ఇంతకుముందు మాన్ స్టర్ అనే సినిమాలో సూర్య సరసన నటించింది. తదుపరి వేరొక చిత్రంలోనూ సూర్య అవకాశం ఇవ్వడంతో ఇద్దరిపైనా ఎఫైర్ గాసిప్స్ వేడెక్కిస్తున్నాయి.